దుత్తలూరులోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కుటుంబ సమేతంగా విచ్చేసి దీపోత్సవంలో పాల్గొన్నారు. భక్తుల కోసం అన్నదానం నిర్వహించారు. ఆలయ ప్రాంగణం దీపాలతో కళకళలాడింది.