నెల్లూరు జిల్లా కలిగిరి మండలం చీమల వారి పాలెం నుండి ఏఎస్ పేట మండలం రంగన్నపాడు ఫారెస్ట్ వరకు వెళ్లే రెండు కిలోమీటర్ల దూరం రోడ్డు గత కొన్ని సంవత్సరాలుగా అద్వానంగా ఉంది. వర్షాలు పడితే ఈ మార్గంలో వెళ్లాలంటే వాహనాలు ఇరుక్కుపోతాయని ప్రజలు భయపడుతున్నారు. అధికారులు చొరవ తీసుకొని ఈ రోడ్డు నిర్మించాలని ప్రజలు కోరారు. ఈ మార్గం పూర్తయితే అబ్బాసాపేట, కొత్తపల్లి, రంగన్నపాడు, గుడిపాడు రవాణా సౌకర్యం కలుగుతుంది.