మర్రిపాడు మండలం నందవరం గ్రామంలో కొంతమంది వ్యక్తులకు సంబంధించిన ఫినిషింగ్ రాళ్లను ఓ వ్యక్తి ధ్వంసం చేసినట్లు బాధితులు వాపోయారు. ఎన్నో ఏళ్ల నుంచి తమ స్థలంలో ఫినిషింగ్ రాళ్లు వేసుకుంటే తమపై కక్షపూరితంగా రాళ్లు ధ్వంసం చేశారని ఆరోపించారు. ఘటనపై తహసీల్దార్ కు, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. ఇందుకు కారణమైన అతనిని కఠినంగా శిక్షించాలని కోరారు.