ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పుట్టినరోజు వేడుకలు ఉదయగిరి నియోజకవర్గంలో గురువారం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని దుత్తలూరు కలిగిరి, కొండాపురం, సీతారాంపురం, వరికుంటపాడు, వింజమూరు, జలదంకి మండలాల్లో టిడిపి శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. పలు ఆలయాల్లో ఆయన పేరుతో ప్రత్యేక పూజలు చేశారు. విద్యార్థులు, అనాధ శరణాలయం పిల్లలకు పుస్తకాలు, భోజనం ఏర్పాటు చేశారు. హాస్పిటల్లో రోగులకు పండ్లు అందజేశారు.