ఉదయగిరి సర్వసభ్య సమావేశంలో సిపిఎం నాయకులు కాకు వెంకటయ్య ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరత వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు దృష్టికి తీసుకుని వచ్చారు. డిప్యూటేషన్ మీద ఇద్దరు డాక్టర్లు బయటకు వెళ్లడంతో సిబ్బంది కొరత ఏర్పడిందని అధికారులు వెంటనే స్పందించాలని ఆయన కోరారు. ఈ విషయం తాజాగా ఆయన ఆదివారం వెల్లడించారు. తగిన వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.