గత రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షపాతం వివరాలను అధికారులు ఆదివారం విడుదల చేశారు. సీతారాంపురం మండలంలో 40. 2 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదయింది. అదేవిధంగా దుత్తలూరులో 17. 6, ఉదయగిరిలో 18. 0, కొండాపురంలో 12. 3, కావలిలో 9. 6, మర్రిపాడు లో 7. 8, సంఘంలో 9. 0, బోగోలలో 7. 2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది.