పూర్తిగా మేఘాలతో కప్పేసి ఎంతో అందంగా ఉన్న ఉదయగిరి కొండ

61చూసినవారు
గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉదయగిరి కొండను మేఘాలు కప్పేసాయి. 730 అడుగులు ఉన్న ఉదయగిరి కొండను మేఘాలు కప్పేయడంతో చూపరులు ఆకట్టుకుంటుంది. ఉదయగిరికి ఎంతో చరిత్ర ఉంది. ఉదయగిరి ప్రాంతాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించారు. ఆయన కాలంలో నిర్మించిన అనేక కోటలు, ఆలయాలు కొన్ని ఇప్పటికి అలాగే ఉన్నాయి. ఆ కోటలు, ఆలయాలతోపాటు కొండ పైకి ఎక్కడానికి కూడా ప్రతి సంవత్సరం ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్