ఉదయగిరి నియోజకవర్గ పల్లెల్లో ప్రతి ఇంట భోగి మంటల వెలుగులు భోగభాగ్యాలను నింపాలని ఇంటిల్లపాది ఎంతో ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ భోగి శుభాకాంక్షలు తెలిపారు. వింజమూరులోని టిడిపి కార్యాలయం ప్రాంగణం నందు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ భోగి మంటలు వేసి మనలోని చెడును ఈ భోగిమంటలలో కాల్చి మంచి అనే వెలుగులను నింపాలని మనస్పూర్తిగా కోరుకున్నారు.