అనంతపురం: తుంగభద్ర జలాశయానికి 15, 790 క్యూసెక్కుల వరద

65చూసినవారు
అనంతపురం: తుంగభద్ర జలాశయానికి 15, 790 క్యూసెక్కుల వరద
అనంతపురం జిల్లా కు సాగు, తాగు నీరు అందించే తుంగభద్ర జలాశయానికి వరద స్థిరంగా కొనసాగుతోందని డ్యామ్ అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 15, 790 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరుతోందన్నారు. ప్రస్తుతం 101. 733 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. 15, 511 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్