ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనంతపురం నగరంలో శుక్రవారం కొనసాగుతోంది. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి సరిపూటి రమణ, మాజీ కో-ఆప్షన్ మెంబర్ మున్వర్, బూత్ ఇన్ చార్జ్ రఫీ చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. తెల్లవారుజామున నుంచి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్నారు.