డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు మీద రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యకుమార్ కార్యాలయ ఇన్ఛార్జ్ హరీశ్ బాబు పేర్కొన్నారు. ఆదివారం ధర్మవరంలోని కళాజ్యోతి సర్కిల్లో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపి, రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయన మాట్లాడుతూ. అంబేడ్కర్ ఆశయాలను కొనసాగిస్తున్న పార్టీ కేవలం అది బీజేపీనే అని అన్నారు.