ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా శనివారం"స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్" కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో గ్రామ పరిశుభ్రతకు కట్టుబడి ఉంటామని అధికారులు ప్రమాణం చేయించారు. అనంతరం ప్రోక్లైన్ సహాయంతో పిచ్చి మొక్కలను తొలగించి చెత్తను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులతో పాటు సర్పంచ్ పిట్ట నరసమ్మ, సెక్రటరీ ఎల్లప్ప పాల్గొన్నారు.