పామిడిలో డిప్యూటీ సీఎం చిత్రపటం ఊరేగింపు

578చూసినవారు
అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను సోమవారం జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలోని ఎద్దులపల్లి రోడ్ లో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి హారతి తీసి టెంకాయలు కొట్టారు. అనంతరం పురవీధుల గుండా బైకు, ఆటలతో భారీ ర్యాలీ నిర్వహించారు. జై జనసేన జై జై జనసేన అంటూ నినాదాలు చేశారు. పవన్ కళ్యాణ్ నామస్మరణతో పామిడి పురవీధులు హోరెత్తాయి.

సంబంధిత పోస్ట్