అనంతపురం జిల్లా కోర్టు బుధవారం హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు, 15,000 రూ. జరిమానా విధించినట్లు గుంతకల్లు ఒకటో పట్టణ సీఐ మనోహర్ ఈ వివరాలు తెలియజేశారు. 2021లో ఇడుపులపాయలు త్రిబుల్ ఐటీ చదువుతున్న అఖిలను, సుబ్రహ్మణ్యం నాయక్ వివాహం చేసుకుని, అదనపు కట్నం కోసం వేధించి 2022 ఏప్రిల్ 1న హత్య చేశాడు. కోర్టులో నేరం రుజువు కావడంతో బుధవారం కోర్ట్ శిక్ష విధించినట్లు సీఐ చెప్పారు.