నల్లచెరువులో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు భరత్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ కూడలిలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఎమ్మార్పీఎస్ నేతలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.