సంపులోపడి చిన్నారి మృతి

3318చూసినవారు
సంపులోపడి చిన్నారి మృతి
కళ్యాణదుర్గం మండలం కొత్తూరులో ఎనిమిదేళ్ల గోవర్ధన్ నీటిసంపులో పడి మంగళవారం మృతి చెందాడు. కొత్తూరు గ్రామానికి చెందిన నరసింహులు, చిక్కమ్మ దంపతుల కుమారుడు గోవర్ధన్. తల్లిదండ్రులు కూలి పనికెళ్లగా గోవర్ధన్ ఆడుకుంటూ ఇంటి సమీపంలోని తోటలో ఉన్న సంపు వద్దకు వెళ్లి నీటిలో పడిపోయాడు. పిల్లవాడు కనిపించకపోవడంతో కాలనీ వాసులతో కలిసి వెతుకుతుండగా చిన్నారి మృతదేహం సంపులో తేలుతుండటంతో స్థానికులు బయటకు తీశారు.

సంబంధిత పోస్ట్