దుర్గం: కళ్యాణదుర్గంను కరవు నియోజకవర్గంగా ప్రకటించాలి

58చూసినవారు
దుర్గం: కళ్యాణదుర్గంను కరవు నియోజకవర్గంగా ప్రకటించాలి
కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ఐదు మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్, సహాయ కార్యదర్శి నరసింహులు డిమాండ్ చేశారు. సోమవారం కళ్యాణదుర్గం ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతివృష్టి, అనావృష్టి కారణంగా కళ్యాణదుర్గం నియోజవర్గంలో పంటలు పండలేదని, కరవు పరిస్థితులు ఉన్నాయని అన్నారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్