ప్రభుత్వం సరఫరా చేసే గడ్డి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని పశు వైద్యశాఖ ఉపసంచాలకులు శ్రీనివాస్ గుప్తా సోమవారం విలేఖరులతో తెలిపారు. విత్తనాలు కళ్యాణదుర్గం, పాలవాయి గ్రామానికి వెయ్యి కిలోల చొప్పున, ముద్దినాయనపల్లి, గోళ్ల గ్రామాలకు 500కిలోల చొప్పున గడ్డి విత్తనాలు వచ్చాయని తెలిపారు. కిలో రూ. 460లు కాగా రాయితీ పోనూ రైతులు రూ. 115లు చెల్లించి విత్తనాలు తీసుకోవాలన్నారు.