కళ్యాణదుర్గం ఆర్టీసీ డిపోకు చెందిన పల్లె వెలుగు కళ్యాణదుర్గం నుంచి బళ్లారికి కొత్త బస్సును ప్రజావేదిక వద్ద ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు శుక్రవారం పూజలు చేసి ప్రారంభించారు. ఆర్టీసీ డిపో మేనేజర్, సిబ్బంది, పార్టీ నాయకులతో కలసి బస్సులో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ప్రయాణించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యాలకు చేర్చాలన్నారు.