మడకశిర నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం ఎస్ రాజు గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు టిటిడి దేవస్థానాన్ని ఉద్దేశించి తెలంగాణ మాజీ మంత్రి, బి. ఆర్. ఎస్. నేత శ్రీనివాస్ గౌడ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు కేవలం బీఆర్ఎస్ ఉనికి కాపాడుకునేందుకే తప్ప మరొకటి కాదు అని ఎమ్మెల్యే, టీటీడీ పాలకమండలి సభ్యులు ఎం. ఎస్. రాజు అన్నారు. టీటీడీని ఉద్దేశించి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.