పరిగి మండలం ధనాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎం. మౌనిక జాతీయ స్థాయి అండర్ 17 వాలీబాల్ పోటీలకు ఎంపిక అయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతిర్మయి తెలిపారు. గురువారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జ్యోతిర్మయి మాట్లాడుతూ ఈ నెల 21 నుండి 23తేదీ వరకు ముద్దిరెడ్డిపల్లి లో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్ 17 బాల బాలికల వాలీబాల్ పోటీలలో మౌనిక ఎంపిక కావడం పట్ల అభినందనలు తెలిపారు.