సోమందేపల్లి మండలం సుద్దకుంటపల్లిలోని ఉప్పర హనుమంతు ఇల్లు బుధవారం రాత్రి అకాల వర్షాల కారణంగా కూలిపోయింది. వర్షం తినే తిండి సహా వివిధ సామాన్లను నాశనం చేసింది. ఇంట్లో ఉన్న బియ్యం, ఇతర వస్తువులు నీటిలో కలిసిపోయాయి. ఇల్లు కూలిపోవడంతో హనుమంతు రోడ్డున పడ్డాడు. తన ఆస్థి నష్టం జరిగినందుకు బాధ వ్యక్తం చేస్తూ, తనను ఆదుకోవాలని అధికారులను వేడుకుంటున్నాడు.