నెలాఖరులోగా 104 బీసీ హాస్టళ్లలో ఎస్సార్ శంకరన్ రిసోర్సు సెంటర్ల ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సవిత పేర్కొన్నారు. బుధవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మంత్రి సవిత మాట్లాడుతూ జనవరిలో సీడాప్, బీసీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో 10 వేల మందిని వ్యాపారవేత్తల తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. కాపు భవనాల నిర్మాణానికి రూ. 5. 41 కోట్లు కేటాయిస్తున్నాం అన్నారు.