జిల్లాలోని అన్ని యాజమాన్యలలోని 10 వ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు ఈ సంవత్సరం కార్యాచరణ ప్రణాళికను సంక్రాంతి సెలవుల తర్వాత అమలు చేయాలని డిటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి గౌస్ లాజమ్, మారుతి కోరారు. గురువారం ఓబుళదేవరచెరువులో వారు మాట్లాడుతూ.. అధిక పాఠశాలల్లో సిలబస్ పూర్తి కావలసి ఉందని, శనివారాలు, ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాలను మినహాయించి కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలన్నారు.