ఆ ఘటనలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి

57చూసినవారు
పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్ కత్తాలో 31 ఏళ్ల వైద్యవిద్యార్థిని మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయకార్యదర్శి ఆంజి శుక్రవారం డిమాండ్ చేశాడు. రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినుల ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేశారు. రోజురోజుకి మహిళలపై కామాంధుల అరాచకాలు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఘటనలపై కఠినంగా వ్యవహరించాలన్నారు.

సంబంధిత పోస్ట్