అనంతపురం జిల్లాలో హంద్రీనీవా కాలువ ఆధునికీకరణ పనులను ఏడాదిలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ హంద్రీనీవా ద్వారా రాయదుర్గం నియోజకవర్గంలోని బైరవానితిప్ప, రాప్తాడు నియోజకవర్గంలోని పేరూరు రిజర్వాయర్, మడకశిరకు సాగునీరు అందించిన తర్వాత చిత్తూరు జిల్లా కుప్పానికి సాగునీరు తీసుకెళ్తామని తెలిపారు.