ట్రాక్టర్ ను ఢీకొన్న బొలెరో వాహనం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

70చూసినవారు
ట్రాక్టర్ ను ఢీకొన్న బొలెరో వాహనం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
రాయదుర్గం పట్టణ శివారులోని కొంతానపల్లి వద్ద శనివారం ట్రాక్టర్ ను బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన రాజు ట్రాక్టర్ నడుపుతూ రాయదుర్గానికి వెళుతుండగా వెనుక వైపు నుంచి బొలెరో వాహనం ఢీకొనడంతో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో రాజు తీవ్రంగా గాయపడ్డారు.

సంబంధిత పోస్ట్