రాయదుర్గం పట్టణంలోని గుగ్గురట్టి కాలనీలో బుధవారం పిచ్చికుక్క దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఏడాదిన్నర వయసున్న చిన్నారి బాషాపై కుక్క దాడి చేయడంతో అనంతపురం తరలించారు. శర్మాస్, ఉమామహేశ్వరిలు కూడా గాయపడ్డారు. కుక్కల బెడద ఎక్కువగా ఉందని అధికారులు స్పందించి కుక్కలను ఇతర ప్రాంతాలకు తరలించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.