శింగనమల మండల కేంద్రంలోని పోస్టల్ శాఖ కార్యాలయంలో శింగనమల సబ్ పోస్ట్ మాస్టర్ గా పవన్ కుమార్ రెడ్డి తన బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా మంగళవారం ఎర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ ఖాతాదారులకు నిత్యం అందుబాటులో వుంటామని తెలియజేశారు. పోస్టల్ శాఖలోని సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సబ్ పోస్ట్ మాస్టర్ పవన్ కుమార్ రెడ్డి కోరారు.