పుట్లూరు: గరుగుచింతలపల్లి చెరువుకు నీటి విడుదల

78చూసినవారు
పుట్లూరు మండలం కోమటికుంట్ల గ్రామంలో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి బుధవారం పర్యటించారు. గ్రామంలోని చెరువు నుంచి గరుగుచింతలపల్లి చెరువుకు హెచ్ ఎల్ సి కాలువ నీటిని రైతులతో కలిసి విడుదల చేశారు. ఈ క్రమంలో పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. అనంతరం రైతులతో మమేకమై ఏమైనా సమస్యలు ఉన్నాయా? అడిగి తెలుసుకున్నారు. నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్