తాడిపత్రి పట్టణంలోని రజక వీధిలో వెలసిన శ్రీ గంగా భవాని దేవస్థానంలో ఈనెల 3వ తేదీ నుంచి శరన్నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నామని భక్త జన బృందం తెలిపారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని 3న బాలాత్రిపుర సుందరి, 4న గౌరీదేవి, 5న రాజరాజేశ్వరి, 6న అన్నపూర్ణాదేవి, 7న లలితాదేవి, 8న గాయత్రి దేవి, 9న సరస్వతి దేవి, 10న కాళికాదేవి, 11న మహాలక్ష్మి తదితర అలంకరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.