పెద్దపప్పూరు లో కర్ణాటక మద్యం పట్టివేత

73చూసినవారు
పెద్దపప్పూరు లో కర్ణాటక మద్యం పట్టివేత
పెద్దపప్పూరు లోని రామకోటి కాలనీలో పోలీసులు బుధవారం కర్ణాటక మద్యాన్ని పట్టుకున్నారు. కాలనీలో కర్ణాటక మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఐ గౌస్ బాషా, సిబ్బంది తో దాడులు నిర్వహించారు. ఈసందర్భంగా కాలనీకి చెందిన చింతా కేశవనారాయణ, చింతా నాగేశ్వర్ రావు ఇళ్ల వద్ద 20 టెట్రా ప్యాకెట్ల కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్