పెద్దపప్పూరు మండలం చాగల్లులో మంగళవారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించామని మండల సీపీఐ కార్యదర్శి చింతా పురుషోత్తం తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటినా ఇచ్చిన హామీలు మరిచిపోయారని తెలిపారు. గ్రామంలో గల సమస్యలను గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల సహాయ కార్యదర్శి బీ. రామేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.