తాడిపత్రి: జూదమాడితే జీవితాలు నాశనం

66చూసినవారు
తాడిపత్రి మండలం చుక్కలూరు సమీపంలో జూదం ఆడుతున్న పలువురిని అరెస్టు చేసినట్లు రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ జూదం ఆడుతున్నట్లు సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి దాడులు చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 4. 45 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జూదాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సీఐ సూచించారు.

సంబంధిత పోస్ట్