తాడిపత్రి: మూడు ఇసుక ట్రాక్టర్ల సీజ్

69చూసినవారు
తాడిపత్రి: మూడు ఇసుక ట్రాక్టర్ల సీజ్
తాడిపత్రి మండలంలోని సజ్జలదిన్నె గ్రామ సమీపంలో మంగళవారం అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి తెలిపారు. స్థానిక పెన్నానది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారన్న సమాచారంతో సిబ్బందితో కలిసి దాడులు చేశా మన్నారు. దాడుల్లో ట్రాక్టర్లను సీజ్ చేసి స్టేషన్ కు తరలించామన్నారు. ట్రాక్టర్ల యజమానులు, డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్