ఉరవకొండ పట్టణంలో సోమవారం ఏఐఎస్ఎఫ్ నాయకులు అరటిపండ్లు అమ్ముతూ వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్షుడు హనుమంతరాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెనకు సంబంధించిన రూ. 3, 580కోట్లు ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు వంశీ, జిల్లా సహాయ కార్యదర్శి చందు పాల్గొన్నారు.