ఉరవకొండ: బళ్లారి నేషనల్ హైవేలో బల్బులు ఏర్పాటు

50చూసినవారు
ఉరవకొండ: బళ్లారి నేషనల్ హైవేలో బల్బులు ఏర్పాటు
ఉరవకొండ పట్టణంలో ఉన్న అనంతపురం బళ్లారి జాతీయ రహదారిలో నేషనల్ హైవే అథారిటీ వారు శుక్రవారం బల్బు అమరిక పనులను చురుగ్గా చేపట్టారు. రాములమ్మ దేవస్థానం వద్ద నుంచి బళ్లారి మార్గానికి వెళ్లే రాయంపల్లి రాస్థా దాకా ఇరువైపులా బల్బులు క్రేన్ల సాయంతో చకచకా అమర్చుతున్నారు. దీంతో రెండు మూడు రోజుల్లో ఉరవకొండం వెలుగులు చిమ్మనున్నాయి. పట్టణవాసులు వాహన చోదకుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్