ఉరవకొండ: అక్రమ రేషన్ బియ్యం పట్టుకున్న పోలీసులు

61చూసినవారు
ఉరవకొండ: అక్రమ రేషన్ బియ్యం పట్టుకున్న పోలీసులు
ఉరవకొండ నుంచి అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని వివిధ వర్గాల నుంచి సేకరించిన 140 ప్యాకెట్ల రేషన్ బియ్యాన్ని లత్తవరం రోడ్డులో బుధవారం ఐచర్ వాహనంలోకి లోడ్ చేస్తుండగా పట్టుకున్నామన్నారు. రేషన్ బియ్యంతో పాటు ఒక ఐచర్ వాహనం, ఒక ఆటోను సీజ్ చేసి, ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్