ఆమదాలవలస మండలం చిన్నవలస గ్రామంలో ఇళ్లను కూల్చి వేసిన ప్రాంతాన్ని మంగళవారం మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. నివాసితులకు ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా అక్రమంగా ఇళ్లను కూల్చివేయడం అధికారులకు తగదన్నారు. కోర్టు ఆదేశాలను పాటిస్తే నివాసితులు రోడ్డు పక్కన ఎందుకు నివాసం ఉంటున్నారో కోర్టుకు వివరించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందని ఆయన డిమాండ్ చేశారు.