క్రీడలతోనే మానసిక ఉల్లాసం అని ఆమదాలవలస ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు అన్నారు. మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో చిల్డ్రన్స్ డే సందర్భంగా నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. విద్యార్థులు విద్యతోపాటు అన్ని రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. వ్యాయామ ఉపాధ్యాయురాలు కుమారి ఆధ్వర్యంలో పిల్లలకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.