ఉద్దేశపూర్వకంగానే తిరుమలను అపవిత్రం చేసారు

69చూసినవారు
ఉద్దేశపూర్వకంగానే తిరుమలను అపవిత్రం చేసారు
కోట్లాది మంది భక్తుల ఆరాధ్యదైవం తిరుమల వేంకటేశ్వర స్వామి లడ్డూ, అన్నప్రసాదాన్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే అపవిత్రం చేశారని ఏపీ సాధు పరిషత్తు అధ్యక్షుడు, ఆనందాశ్రమం పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి విమర్శించారు. పొందూరు మండలం కృష్ణాపురం ఆనందాశ్రమంలో శనివారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడారు. రాజకీయ లబ్ధికోసం హిందువులను మోసం చేశారని, తిరుమల పవిత్రను మంటగలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్