ఆమదాలవలస: ధాన్యం కొనుగోలు తక్షణమే చేపట్టాలి
రైతులు వద్ద నుండి ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని, ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని వైస్సార్సీపీ ఆముదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవి కుమార్ అన్నారు. బుధవారం ఒక పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ రైతులు చాలా వరకు పంట కోతలు పూర్తి చేసి ధాన్యం బస్తాలు పొలాల్లో పెట్టుకుని ఉన్నారని, కాని ప్రభుత్వం ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించక పోవటం రైతులను నిర్లక్ష్యానికి గురిచేయటమేనని అన్నారు.