ప్రజలపై విద్యుత్ భారాలు వేయకూడదని మోసపూరిత విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని సీపీఎం నాయకులు సి. హెచ్. అమ్మన్నాయుడు, పోలాకి ప్రసాదరావు, వెలమల రమణ డిమాండ్ చేశారు. ప్రజలపై విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా రణస్థలంలో రామతీర్థం జంక్షన్ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. రైతులు, ప్రజల పాలిట ఉరితాళ్లగా మారనున్న విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగింపు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.