ఇచ్ఛాపురం రూరల్ మండలం లొద్దపుట్టి గ్రామ సమీప జాతీయ రహదారిపై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి రహదారికి అడ్డంగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు.