కవిటి మండలం రాజపురం గ్రామంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ వైసీపీకి చెందిన పలువురు కొన్ని ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వాటిని బుధవారం అర్ధరాత్రి దాటిన వేళ గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు. గురువారం ఉదయం వాటిని చూచిన వైసీపీకి చెందిన వ్యక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ. ధైర్యంగా ఎదుర్కోలేక ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు.