పిసిసి అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో ఇచ్చాపురం నియోజకవర్గానికి చెందిన డాక్టర్ పూడి కిరణ్ కుమార్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈయన గతంలో విద్యార్థి సంఘ నాయకుడిగా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం అనేక ధర్నాలు, ఉద్యమాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలంటే, పేద ప్రజలకు, రైతులకు న్యాయం జరగాలంటే భవిష్యత్ లో భారత దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అందుకే పార్టీలో చేరానన్నారు.