కంచిలిలో ఆర్టీసీ బస్ సర్వీస్ను ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్

76చూసినవారు
కంచిలి మండలం జె. శాసనంలో సోమవారం నూతన ఆర్టీసీ బస్ సర్వీసును ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు ప్రారంభించారు. ఈ మేరకు కంచిలి నుంచి గోకర్ణపురం, జలంత్రకోట తదితర గ్రామాల మీదుగా బస్ సర్వీసును అశోక్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు టీడీపీ మండల కార్యదర్శి మాదిన రామారావు, మండల టీడీపీ అధ్యక్షుడు బంగారు కురయ్య, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్