TG: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మొదటి విడతలో ఇండ్ల స్థలం ఉన్నవారికి, రెండో విడతలో ఇంటి స్థలంతో పాటు ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. నివాస స్థలం ఉన్నవారి జాబితా, స్థలం లేని వారి జాబితాలను వేర్వేరుగా గ్రామసభల్లో పెట్టాలని అధికారులకు సూచించారు. పలు అంశాలపై సచివాలయంలో సీఎస్ శాంతికుమారితో కలిసి సమీక్షించారు.