TG: నేటితో స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ముగిశాయి. దాదాపు వారం రోజులు పండగ హాలిడేస్ ఎంజాయ్ చేసిన విద్యార్థులు రేపటి నుంచి బడి బాట పట్టనున్నారు. రాబోయే 2, 3 నెలలు పరీక్షాసమయం కావడంతో స్టూడెంట్స్ ఇక పుస్తకాలకే అంకితం కానున్నారు. కాగా ఈనెల 11 నుంచి 17 వరకు ప్రభుత్వం పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. అటు జూనియర్ కాలేజీలు ఇవాల్టి నుంచి పున:ప్రారంభం అయ్యాయి.