ప్రతి ఒక్క ఆర్టీసీ కాంప్లెక్స్‌లో తప్పనిసరిగా మహిళలకు సంబంధించి బ్రెస్ట్ ఫీడింగ్ గదులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్వప్నికల్ దినకర్ ఆదేశించారు. ఈ మేరకు నరసన్నపేట ఆర్టీసీ కాంప్లెక్స్‌లో గది ఏర్పాటు చేసేందుకు టెక్కలి డిపో మేనేజర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పరిశీలించారు. దీనిలో భాగంగా స్థానిక సీడీపీవో నాగమణి మాట్లాడుతూ. మహిళలు తమ బిడ్డలకు పాలిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.